Search
Wednesday 1 March 2017
  • :
  • :

నాగచైతన్యా…. రెండు ముహూర్తాలూ ఒక్క రోజేనా..?

అక్కినేని నాగచైతన్య, సమంతల నిశ్చితార్థం ఈ నెల 29న జరగుతుందని ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అదే రోజు నాగచైతన్యకు మరో ముహూర్తం కూడా కుదిరినట్లు తెలుస్తోంది. చైతూ మేనమామ దగ్గుబాటి సురేష్‌బాబు కోరిక ఆ రోజే నెరవేరబోతోందట. చైతూ హీరోగా తమ బేనర్‌లో సినిమా చేయాలని సురేష్‌బాబు ఎప్పటి నుంచో అనుకుంటున్నారట.

కృష్ణ అనే ఓ కొత్త దర్శకుడితో చైతూ హీరోగా దగ్గుబాటి రానా ఓ సినిమా నిర్మించబోతున్నాడట. చైతూ నిశ్చితార్థం జరిగే జనవరి 29వ తేదీనే నూతన చిత్రం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేశారని సినీజనం అనుకుంటున్నారు. ఒక వైపు నిశ్చితార్థ ముహూర్థం, మరో వైపు మేనమామ కోరిక తీర్చే ముహూర్తం రెండూ ఒకేరోజు కుదరడంతో చైతూ తెగ సంబరపడిపోతున్నాడట. అయితే దీనికి సంబంధించి అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు.