Search
Monday 27 February 2017
  • :
  • :

అరుదైన ఫీట్ అందుకున్న అక్కినేని నాగార్జున

వరుసగా సినిమాలు కమిట్ అవడంలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ దూసుకుపోతున్నాడు కింగ్ నాగ్. తాజాగా సోషల్ మీడియాలో ఓ అరుదైన ఫీట్ సాధించాడు నాగార్జున.

గత ఏడాది సంక్రాంతికి  సోగ్గాడే చిన్నినాయన చిత్రంతో కెరీర్‌లోనే పెద్ద సక్సెస్ అందుకున్నాడు నాగార్జున. ఈసారి మాత్రం సంక్రాంతికి కాకుండా ఫిబ్రవరిలో వస్తున్నాడు. అయితే ఆ లోటు పూడుస్తూ మరోవిధంగా అభిమానులలో ఉత్సాహం నింపాడు నాగ్. తాజాగా ట్విట్టర్‌లో నాగార్జున ఓ అరుదైన ఫీట్ సాధించాడు. ట్విట్టర్‌లో టు మిలియన్ మార్క్‌ను దాటేశాడు నాగార్జున. అంటే నాగ్‌ను 20 లక్షలమంది ఫాలో అవుతున్నారన్న మాట.

దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి కూడా ఇప్పటికే ట్విట్టర్‌లో 2 మిలియన్ మార్క్ క్రాస్ చేసేశారు. అయితే ట్విట్టర్ ఖాతా ఉన్న తెలుగు హీరోల్లో ఈ రేంజ్ ఫాలోవర్స్ ఉన్న రెండో హీరో నాగార్జునే. మహేశ్ బాబుకు 2.76 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సినిమాలతో పాటు కొడుకుల సినిమాలను ట్విట్టర్ ద్వారా ప్రమోట్ చేసే నాగార్జున అప్పుడప్పుడు ఇతర హీరోల సినిమాలను కూడా ప్రోత్సహిస్తుంటారు. అలాగే ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ట్వీట్ చేస్తుండడంతో పాటు ఇతర సెలబ్రిటీస్ తోనూ కలివిడిగా ఉంటుంటారు నాగ్. ఇలా రెగ్యులర్‌గా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉండే నాగ్ ఈ అరుదైన ఫీట్ అందుకున్న టాలీవుడ్ సీనియర్ కావడం విశేషం. మరి ఇదే జోష్‌లో రాబోయే సినిమాలతోనూ నాగ్ అలరిస్తాడని ఆశిద్దాం..!