Search
Wednesday 29 March 2017
  • :
  • :

ఖైదీ ఫంక్షన్‌ జరపడం పవన్‌కు అసలు ఇష్టం లేదట..!

మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రం  ఖైదీ నెంబర్‌ 150  ప్రీ-రిలీజ్‌ ఫంక్షన్‌ శనివారం గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌లో ఘనంగా జరుగనుంది. ఈ వేడుకకు పవన్‌ వస్తాడా, రాడా అనేది పెద్ద మిస్టరీగా మారింది. పవన్‌ను ఈ ఫంక్షన్‌కు రప్పించడానికి మెగా ఫ్యామిలీ భారీగా ప్రయత్నాలు చేస్తోంది.

నిజానికి, ఈ టైమ్‌లో అక్కడ ‘ఖైదీ’ ఫంక్షన్‌ చేయడం పవన్‌కు అస్సలు ఇష్టం లేదట. అన్నయ్య సినిమాకు ఈ ఫంక్షన్‌ చేయనవసరం లేదని పవన్‌ భావిస్తున్నాడట. నిజానికి, ఇలాంటి ఫంక్షన్‌లు సినిమా పబ్లిసిటీ కోసమే చేస్తారు. ఆ కోణంలో చూస్తే ‘ఖైదీ’ సినిమాకు ఇప్పటికే విపరీతమైన పబ్లిసిటీ లభించింది. అందుకే ఎలాంటి హడావుడీ లేకుండా డైరెక్ట్‌గా సినిమా విడుదల చేసేస్తే బాగుంటుందని పవన్‌ సూచిస్తున్నాడట. అయితే చిరంజీవి మాత్రం వేరే విధంగా ఆలోచిస్తున్నాడట. చాలా సంవత్సరాల తర్వాత వెండితెర మీద కనబడనుండడంతో ఒకసారి జనాల మధ్యకు వెళితే మంచిదని చిరు అనుకుంటున్నాడట.