Search
Thursday 23 March 2017
  • :
  • :

మాస్ ‘లీడర్‌’గా రానా

విలన్‌గా మంత్రముగ్దుల్ని చేసిన రానా ఇప్పుడు హీరోగానూ డిఫరెంట్‌గా కనిపించేందుకు రెడీ అవుతున్నాడట. కుర్ర హీరో నయా మూవీలోని లుక్ చూసిన చాలామంది, ఈ సారి మనోడు మాస్ లీడర్‌గా మెప్పిస్తాడేమో అని చర్చించుకుంటున్నారట. ‘బాహుబలి-2’ షూటింగ్ నుంచి చాలాకాలం క్రితమే రిలీవ్ అయిన రానా, ఇప్పుడు హీరోగా తన కెరీర్‌ను బిల్డప్ చేసుకోవడంపైనే ఫోకస్ పెట్టాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ‘ఘజి’ షూటింగ్ దాదాపుగా పూర్తి కావడంతో, ప్రస్తుతం తేజ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న తన నయా మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు ఈ దగ్గుబాటి హీరో. ఈ సినిమా షూటింగ్ అనంతపురం పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. దీంతో ఇందులో రానా ఎలాంటి క్యారెక్టర్ పోషించబోతున్నాడనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సినిమాలోని రానా స్టిల్స్‌ను బట్టి అతడు పొలిటికల్ లీడర్‌గా కనిపించబోతున్నాడని కొందరు చర్చించుకుంటున్నారు. ‘లీడర్’ మూవీలో సాఫ్ట్ పొలిటిషియన్‌గా కనిపించిన రానా, ఈ సారి మాత్రం కాస్త మాస్ టచ్ ఉన్న రాజకీయ నేతగా అలరించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. చాలా ఏళ్లుగా హిట్ లేని దర్శకుడు తేజ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు బాగానే ఉన్నాయి.

‘బాహుబలి’ వంటి బ్లాక్ బస్టర్ మూవీలో విలన్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రానా, ఈ సినిమాలో సరికొత్త తరహాలో పెర్ఫామెన్స్ ఇవ్వబోతున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మార్చి ఎండింగ్ నాటికి పూర్తయ్యే ఛాన్స్ ఉందని టాక్. మొత్తానికి మరోసారి లీడర్‌గా కనిపించబోతున్న రానా ఈ సారి ఏ రకంగా ఆకట్టుకుంటాడో చూడాలి.