Search
Monday 23 January 2017
  • :
  • :

నితిన్ ఒక నిర్మాతను తెగ టెన్షన్ పెడుతున్నాడట!

రెండు సినిమాలను ఫైనలైజ్ చేసుకున్న ఆ యంగ్ హీరో… మరో నిర్మాతను టెన్షన్ పెడుతున్నాడట. ఓ సినిమా కోసం కేటాయించిన డేట్స్‌ను మరో మూవీకి షిఫ్ట్ చేయడమే ఇందుకు కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి.

తన కొత్త సినిమాల ఎంపిక విషయంలో ఎంతో కేర్ ఫుల్‌గా వ్యవహరిస్తున్న హీరో నితిన్… ప్రస్తుతం రెండు సినిమాలకు కమిటయ్యాడని ఇండస్ట్రీ వర్గాలు అంటుంటాయి. అందులో హను రాఘవపూడి డైరెక్షన్‌లోని సినిమా ఒకటి కాగా… పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, సుధాకర్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కబోయే సినిమా మరొకటి. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది ఆడియెన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

అయితే ఇందులో ఒక సినిమాకు నితిన్ కేటాయించిన డేట్స్… అంతకుముందుగానే మరో నిర్మాతకు ఇచ్చాడనే ప్రచారం ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. ‘బెంగాల్ టైగర్’, ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ వంటి సినిమాలను రూపొందించిన నిర్మాత కె.కె. రాధామోహన్… నితిన్‌తో సినిమా చేయాలని భావించి… అతడికి కోటి రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడట. అయితే అనుకోకుండా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, సుధాకర్ రెడ్డి నిర్మాణంలో రూపొందబోయే సినిమా ఛాన్స్ రావడంతో ఈ డేట్స్ కాస్త అటు మళ్లించాడట ఈ యంగ్ హీరో.

దీంతో కె.కె.రాధామోహన్‌తో నితిన్ సినిమా ఎప్పుడు ఉంటుందనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతకుముందే మాట ఇచ్చి… అడ్వాన్స్ కూడా తీసుకున్న నిర్మాతతో నితిన్ సినిమా చేస్తాడా లేక ఈ రెండు సినిమాలు పూర్తయ్యేంత వరకు ఆ ప్రాజెక్టును లూప్ లైన్‌లో పెడతాడా అన్న దానిపై ఎవరికీ పెద్దగా క్లారిటీ లేదు. మొత్తానికి కె.కె.రాధామోహన్ సినిమాను కలుపుకుంటే నితిన్ ఖాతాలో మూడు సినిమాలు ఉన్నట్టే అని భావించాలి.