Search
Sunday 22 January 2017
  • :
  • :

ఎన్టీయార్‌ కొత్త సినిమా పేరు అదిరింది..!

ఎన్టీయార్‌, దర్శకుడు బాబితో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఎన్టీయార్‌ అన్నయ్య నందమూరి కల్యాణ్‌రామ్‌ తన ఎన్టీయార్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై రూపొందిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్‌ విషయంలో కొన్ని రోజులుగా రకరకాల గ్యాసిప్స్‌ వినబడుతున్నాయి.

ఈ సినిమాకు ‘జయ్‌.. లవ.. కుశ’ అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది. తన బ్యానర్‌ పేరు మీద కల్యాణ్‌రామ్‌ ఈ పేరు రిజిస్టర్‌ చేయించారు. ఫిబ్రవరి పదో తేదీ నుంచి ఈ సినిమా ప్రారంభం కానున్నట్టు సమాచారం. సమంత, కాజల్‌, తమన్నా, కీర్తీసురేష్‌లలో ఎవరో ఇద్దర్ని ఈ సినిమా కోసం ఎంపిక చేయనున్నట్టు సమాచారం.