Search
Monday 23 January 2017
  • :
  • :

నాగ్‌ సినిమాలో సమంత..?

కొడుకులిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్న ప్రస్తుత తరుణంలో కూడా అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘ఓం నమోవేంకటేశాయ’ సినిమాలో నటిస్తున్న నాగ్‌.. ఆ తర్వాత ‘రాజుగారి గది-2’లో చేయబోతున్నాడు. టీవీ యాంకర్‌ ఓంకార్‌ దీనికి దర్శకుడు.

ఈ సినిమాలో నాగ్‌తోపాటు ముగ్గురు సుందరాంగులు నటిస్తున్నారట. ఓ పాత్ర కోసం ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సీరత్‌ కపూర్‌ను ఎంపికచేయగా, మరో రోల్‌ కోసం నాగ్‌ కాబోయే కోడలు సమంతను తీసుకున్నారట. మరో, హీరోయిన్‌ ఎంపిక జరగాల్సి ఉంది. నాగ్‌, సమంత ఇంతకుముందే ‘మనం’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.