Search
Wednesday 18 January 2017
  • :
  • :

పారితోషకం విషయంలో శ్రీనువైట్ల కొత్త ఫార్ములా

కొత్త ఏడాదిలో ఓ వైపు సినిమాలు, మరోవైపు పెళ్లికి సంబంధించిన పనులతో ఫుల్ బిజీగా ఉన్న అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, కొత్త సినిమాలకు కమిటయ్యే విషయాల్లో మాత్రం అదే జోష్‌ను కొనసాగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో నటిస్తున్న ఈ యంగ్ హీరో, శ్రీను వైట్ల డైరెక్షన్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. నాగార్జునతో అనేక సినిమాలు తెరకెక్కించిన నిర్మాత శివప్రసాద్ రెడ్డి, ఈ ఇద్దరి కాంబినేషన్‌లోనే సినిమా తీయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా ‘మిస్టర్’ మూవీని తెరకెక్కిస్తున్న శ్రీను వైట్ల, ఈ సినిమా రెమ్యూనరేషన్ విషయంలో కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టు సమాచారం. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా భారీగానే రెమ్యూనరేషన్ అందుకున్న శ్రీను వైట్ల ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు రెమ్యూనరేషన్ తీసుకోవద్దని డిసైడయ్యాడట. సినిమా సక్సెస్ అయ్యే రేంజ్‌ను బట్టి ఆ తరువాత పారితోషికం పుచ్చుకోవాలని డిసైడయ్యాడట కష్టాల్లో ఉన్న ఈ స్టార్ డైరెక్టర్.

అయితే ఇది నిజంగా శ్రీను వైట్ల తీసుకున్న నిర్ణయమా లేక నిర్మాతలు పెట్టిన కండిషనా అనే విషయం తెలియాల్సి ఉందని ఇండస్ట్రీలో కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. మొత్తానికి ‘మిస్టర్’ సినిమా రిజల్ట్ మీదే దర్శకుడిగా శ్రీను వైట్ల కెరీర్ ఎటు వైపు సాగుతుందనే విషయంలో క్లారిటీ వస్తుందని ఇండస్ట్రీలోని చాలామంది చర్చించుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.