Search
Friday 24 March 2017
  • :
  • :

నోట్ల రద్దుపై కాంగ్రెస్‌ ఇంప్లిమెం​టేషన్‌ కమిటీ

పెద్ద నోట్లు రద్దై రెండు నెలలు గుడుస్తున్నా.. ఇంకా సామాన్యుల సమస్యలు తీరక పోవడంపై కాంగ్రెస్‌ కదం తొక్కింది. నోట్ల రద్దుపై మోదీ నిర్ణయానికి వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర ఇప్పటికే ధర్నాలు చేపట్టారు కాంగ్రెస్‌ కార్యకర్తలు. తాజాగా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు.. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ కీలక నేతలంతా నోట్ల రద్దు అంశంపై ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నారు. ఇందులో భాగంగా స్టేట్ లెవల్ ఇంప్లిమెంటేషన్ కమిటినీ ఏఐసీసీ ప్రకటించింది. మాజీ పీసీసీ అధ్యక్షులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య చైర్మన్‌ గా, మాజీ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి కో చైర్మన్‌ గా కమిటీ ఏర్పాటు చేశారు.

ఇంప్లిమెంటేషన్‌ కమిటీ వివరాలు:

పొన్నాల లక్ష్మయ్య – చైర్మన్‌

సబిత ఇంద్రారెడ్డి – కో చైర్మన్‌

మల్లు రవి -కన్వీనర్‌

దాసోజు శ్రవణ్‌ -కో కన్వీనర్‌

ప్రేమ్‌ లాల్‌ – ప్రెస్‌ కోఆర్డినేటర్‌

సభ్యులుగా ఎమ్మెల్యేలు సంపత్‌ కుమార్‌, వంశీ చంద్‌ రెడ్డి, మాజీ ఎమ్‌ఎ‍ల్సీ కమలాకర్‌ రావు తదితరులు ఉన్నారు.