Search
Friday 20 January 2017
  • :
  • :

ఎయిరిండియా చెత్త రికార్డు

విమానంలో వెళ్లాలంటే ముందుగా ఏ విమానయాన సంస్థను ఎంపిక చేసుకోవాలన్నది అన్నింటికంటే ముఖ్యం. కేబిన్లు, సేవల నాణ్యతతో పాటు.. అసలు విమానాలు ఎంత ఆలస్యంగా వస్తున్నాయన్నది కూడా అన్నింటికంటే ముఖ్యం. ఫ్లైట్ స్టాట్స్ అనే సంస్థ ప్రతియేటా ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ర్యాంకులు ఇస్తుంది. ఏడాది మొత్తమ్మీద విమాన సర్వీసులు ఎన్నిసార్లు ఆలస్యం అయ్యాయి, రద్దయ్యాయి, లోపల సేవలు ఎలా ఉన్నాయనే వివిధ అంశాల ఆధారంగా ఈ ర్యాంకులు ఇస్తారు. ప్రపంచంలో అత్యంత చెత్త విమానయాన సంస్థలుగా మొత్తం పదింటిని ఎంపిక చేస్తే.. వాటిలో మన ఎయిరిండియాకు మూడో ర్యాంకు వచ్చింది. 

2016 సంవత్సరానికి అతి చెత్త విమానయాన సంస్థలు.

10. హైనన్ ఎయిర్‌లైన్స్9. కొరియన్ ఎయిర్8. ఎయిర్ చైనా7. హాంకాంగ్ ఎయిర్‌లైన్స్6. చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్5. ఏషియానా ఎయిర్‌లైన్స్4. ఫిలిప్పైన్ ఎయిర్‌లైన్స్3. ఎయిరిండియా2. ఐలండ్‌ ఎయిర్ 1. ఈఐ ఎఐ

2016 సంవత్సరానికి అత్యుత్తమ విమానయాన సంస్థలు.

10. కాంటాస్9. టామ్ లిన్హాస్ ఏరియాస్8. డెల్టా ఎయిర్‌లైన్స్7. సింగపూర్ ఎయిర్‌లైన్స్ 6. ఏఎన్ఏ5. ఆస్ట్రియన్4. ఖతార్ ఎయిర్‌వేస్3. జేఏఎల్2. ఐబీరియా1. కేఎల్ఎం