Search
Friday 20 January 2017
  • :
  • :

ఇలా అయితే ఢమాల్!

ఆరోగ్యకరమైన రతిక్రీడ మిమ్మల్ని ఉత్సహపరుస్తుంది. కానీ, కొన్ని విషయాలు రతిక్రీడలోని ఆనందాన్ని తగ్గిస్తాయి. అంతే కాకుండా కామోద్రేకం తగ్గుతుంది. కామవాంఛ సన్నగిల్లి లైంగిక జీవితం దెబ్బ తింటుంది. లైంగిక జీవితాన్ని శరారీక, ఉద్వేగ, మానసికపరమైన పలుఅంశాలు ప్రభావితం చేస్తాయి. 

తమలోనో, తమ జీవితబాగస్వామిలోనో లైంగిక వాంఛలు తగ్గుతున్నాయని చాలా మంది ఫిర్యాదు చేస్తుంటారు. మీ భాగస్వామి ఒత్తిడికి,మనస్తాపానికి,డిప్రెషన్ కు గురై ఉండవచ్చు. లేదా మీతో దూరం పెరిగి ఉండవచ్చు. 

కొన్ని భౌతికపరమైన సమస్యలు కూడా లైంగిక జీవితం దెబ్బ తిన్న దాంపత్య జీవితంలో నిరాశ పేరుకుపోతుంది. 

  • ఆరు లేదా అంతకన్నా తక్కువ గంటలు నిద్రపోతే లైంగిక వాంఛలు తగ్గి కామోద్రేకం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఆరు గంటలు నిద్రపోయినా తగిన విధంగా అది లేకపోతే అది లైంగిక జీవితంపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. 
  • ఇది విచిత్రంగానే అనిపించవచ్చు, మీ జీవిత భాగస్వామి గురక పెడితే మీ నిద్రకు భంగం వాటిల్లడమే కాకుండా కామోద్రేక స్థాయి క్రమంగా తగ్గుతూ వస్తుంది. గురుక పెట్టడం వల్ల నిద్రను సరిగా పొందలేకపోవడమే కాకుండా శ్వాస సంబంధమైన సమస్యలు ఎదురవుతాయి. దాని వల్ల శరీరం లావెక్కుతుంది. అది కూడా లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. 
  • మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి వాటి వల్ల కామోద్రేకం తగ్గుతుంది. అది లైంగిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. 
  • శరీరం లావెక్కితే కూడా లైంగిక జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు. ఫాట్ సెల్స్ సెక్స్ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయని నిపుణులు చెపుతున్నారు. 
  • స్మోకింగ్,డ్రింకింగ్ అలవాట్లు వున్నా వ్యక్తుల్లో కూడా కామోద్రేక స్థాయి తక్కువగా ఉంటుంది. అనారోగ్యకరమైన అలవాట్లు లేని వారు శరీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండి, రతిక్రీడను ఆనదించగలుగుతారు.