Search
Sunday 26 March 2017
  • :
  • :

వేళ చూసి మన్మధ క్రీడ:

రతిక్రీడకు పెద్దలు కొన్ని సమయాలు పెట్టారు. శృంగారంలో సమయానికి చాలా ప్రాధాన్యం వుంది. మల్లె వేళ అనే ఓ సినిమా పాట ఉండనే వుంది. అలాగే రాత్రికి రాత్రి వస్తానన్నావూ మామా అని ఓ వయ్యారి భామ తన ప్రియుడిని ఉద్దేశించి ఓ సినిమాలో పాడుతుంది. 

నూతన వధూవరులకు శోభనం రోజు రాత్రి అంగ ప్రవేశానికి మంచి లగ్గం పెడతారు. ఇతర రోజుల్లో కూడా సెక్స్ కు ఓ మంచి సమయం సందర్భం ఉందని నిపుణులు చెపుతున్నారు. వీటినే రతిక్రీడ గోల్డెన్ రూల్స్ గా పిలుస్తారు. 
అందువల్ల లైంగిక భాగస్వాములు సమయం సందర్భం చూసుకొని పడక ఎక్కితే అది ఆనందాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు పడక ఎక్కితే అది ఎవరికో ఒకరికి అసంతృప్తిని మిగిల్చే అవకాశాలే ఎక్కువ. అందుకని వేళ చూసి కైపెక్కి,మన్మధక్రీడ సాగించడమే మంచిది. ఇవ్వన్నీ సాంప్రదాయకులు పెట్టిన నిబంధనలు ఆధునిక కాలానికి అనుగుణంగా మార్చుకోవచ్చు. 
  • పగటిపూట రతిక్రియ చేయకూడదని అంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అది ఎనలేని ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఏకాంతం ఉండేలా, ఇతరులు ప్రవేశించి కదిలించకుండా చూసుకోవాలి. 
  • రాత్రి సమయాల్లో రతిక్రీడ సాగిస్తే ఎందుకైనా మంచిది. వీలైతే మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుని ఆ కార్యాన్ని ఒకేసారి చేయడం మంచిది. 
  • భోజనం చేసిన తరువాత వెంటనే రతిక్రీడకు ఉపక్రమించకూడదు. కనీసం మూడు గంటల వ్యవధి ఉంటే శృంగారాన్ని తనివితీరా అనుభవించగలరు. 
  • నిద్రకు ఉపక్రమించే ముందు పాలు సేవించకూడదు. పాలు తప్పనిసరిగా తీసుకోవాలనుకుంటే నిద్రపోయే ఓ గంట ముందు తీసుకోవాలి. అది ఆరోగ్యానికి చాలా మంచిది. 
  • స్త్రీలు రుతుక్రమములో ఉన్నప్పుడు వారితో సంభోగించరాదు. తొలి నాలుగు రోజుల్లో కనీసం కండోమ్ ఉపయోగించి కూడా రతిక్రియ జరపకూడదు. దాని వల్ల జబ్బులకు దూరంగా వుంటారు. 
  • కొందరు రతిక్రియ జరిపేటప్పుడు కేవలం వీర్యస్ఖలనం అయ్యేందుకు లేదా పిల్లల్ని పుట్టించేందుకు మాత్రమేనని అపోహ పడుతుంటారు. ఇలాంటి భావన మంచిది కాదు. తనివితీరా దంపతులు ఆనందాన్ని అనుభవించడానికి శృంగారమనే భావన ఉండాలి. 
  • రతిక్రియకు ముందు రొమాంటిక్ మాటలు మాట్లాడుతూ,,, ఫోర్ ప్లే చేసుకుంటూ స్త్రీ భావప్రాప్తి పొందేలా చేయాలి. ఆ తరువాత అంగప్రవేశంచేసినట్లయితే సెక్స్ లో పాల్గొన్న స్త్రీ-పురుషులిద్దరూ సంతృప్తిని పొందుతారని సెక్స్ నిపుణులు చెపుతున్నారు.